అల్లు అర్జున్ అరెస్టు వెన‌క ప‌వ‌న్‌... బాబు ద్వారా రేవంత్‌పై ఒత్తిడి..?

Reddy P Rajasekhar
స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పవన్, బన్నీ మధ్య గ్యాప్ ఉంది. వైసీపీ అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడం పవన్ ఫ్యాన్స్ కు, పవన్ కు కోపం తెప్పించింది. నాగబాబు సైతం పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు సంచలనం అయ్యాయి. అల్లు అర్జున్ కు ఏపీలో వైసీపీ నుంచి సపోర్ట్ లభిస్తోంది.
 
అయితే అల్లు అర్జున్ అరెస్టు వెన‌క ప‌వ‌న్‌ ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చంద్రబాబు ద్వారా రేవంత్ పై ఒత్తిడి తెచ్చి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ సీఎం జగన్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బన్నీ తన అరెస్ట్ విషయంలో రాజకీయ జోక్యం ఉందని భావిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
 
హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదని జగన్ అన్నారు. ఈ ఘటన విషయంలో బన్నీ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని జగన్ కామెంట్లు చేశారు.
 
అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదని ఆయన పేర్కొన్నారు. బన్నీ అరెస్ట్ విషయంలో చోటు చేసుకున్న ఘటనలు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి. చంచల్ గూడ జైలు దగ్గర భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారని భోగట్టా. బన్నీ అరెస్ట్ విషయంలో అంచనాలకు అందని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: