అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బెయిల్ మంజూరు..!
ముఖ్యంగా అల్లు అర్జున్ కి బెయిల్ పైన సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.. అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు కొన్ని నిమిషాల క్రితం తెలియజేసింది.. అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు సైతం అల్లు అర్జున్ కి మద్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ ని సైతం పోలీసులు చంచల్గూడా జైలుకి తరలించినట్లుగా సమాచారం.. మొత్తానికి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ రావడంతో అభిమానులైతే కాస్త కృషిగా ఉన్నారు మరి ఈ అరెస్టు విషయం పైన అల్లు అర్జున్ మొదటిసారి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
అల్లు అర్జున్ ని అరెస్ట్ వెనుక ఏదో కుట్ర ఉందని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పైన కూడా పలు రకాల విమర్శలు అభిమానులు చేస్తూ ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని అల్లు అర్జున్ అరెస్టు పైన తన జోక్యం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.. తొక్కిసాలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలోనే పోలీసులు ఇలా చట్టపరమైన నిర్ణయం తీసుకున్నారంటూ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇటీవలే మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. ఇప్పటికే మెగా హీరోలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు.