అల్లు అర్జున్ కి సపోర్టుగా పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..!
అయితే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో ఒక్కసారిగా సిని పరిశ్రమ రాజకీయ ప్రముఖుల సైతం తప్పు పట్టారు. ఇలాంటి సమయంలోనే హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఒక సంచలన ట్విట్ చేసింది.. పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇలా ట్విట్ చేస్తూ .. పబ్లిక్ ర్యాలీలో పలు రకాల ఘటనలో చాలామంది అమాయకులు తొక్కిసలాటలో మరణిస్తూ ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్టు కోసం నేను ఎదురు చూస్తున్నాను..ఇటీవలే ఒక యంగ్ యాక్టర్ కూడా ఒక ర్యాలీలో ఊపిరాడకుండా కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.. అయితే అల్లు అర్జున్ వారసత్వంతో కాకుండా స్వయంకృషితో ఎదిగిన ఒక స్టార్ హీరో అంటూ అల్లు అర్జున్ పైన ట్విట్ చేసింది ఈ అమ్మడు.
దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదంతా బాగానే ఉన్న ఈ పోస్టు తర్వాత వెంటనే మరొక పోస్ట్ షేర్ చేసింది.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ కూడా అల్లు అర్జున్ తో దిగిన ఒక పాత ఫోటోని కూడా షేర్ చేసింది పూనమ్ కౌర్. దీంతో మెగా అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టుపై పూనమ్ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.