చిన్నికృష్ణ: అల్లు అర్జున్‌కు మరక అంటించిన రేవంత్ సర్వనాశనమే ?

Veldandi Saikiran
అల్లు అర్జున్ అరెస్ట్‌ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విలన్‌ గా మారారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే అల్లు అర్జున్ అరెస్ట్‌ అయ్యాడని అందరూ అంటున్నారు. సక్సెస్‌ మీట్‌ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోవడంతో... అల్లు అర్జున్ ను టార్గెట్‌ చేసినట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే.. ఇలాంటి నేపథ్యంలోనే...తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై గంగోత్రి సినిమా రైటర్ చిన్నికృష్ణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు గంగోత్రి సినిమా రైటర్ చిన్నికృష్ణ.

అల్లు అర్జున్ కు మరక అంటించాలని చూసిన ఏ నాయకుడైనా, ప్రభుత్వమైనా నాశనం అయిపోతారని హెచ్చరించారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ అనేది దుర్మార్గమైన చర్య అంటూ నిప్పులు చెరిగారు. అసలు రేవతి సంఘటనకు సంబంధం లేకున్నా.. అల్లు అర్జున్ అరెస్ట్‌ అయ్యారని గంగోత్రి సినిమా రైటర్ చిన్నికృష్ణ ఫైర్‌ అయ్యారు. కావాలనే కక్ష్య గట్టి.. అరెస్ఠ చేశారన్నారు. అల్లు అర్జున్ కు మరక అంటించాలని చూసిన ఎవరైనా నాశనమే అంటూ బాంబ్‌ పేల్చారు గంగోత్రి సినిమా రైటర్ చిన్నికృష్ణ.

ఇది ఇలా ఉండగా....అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. హైకోర్ట్ బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణం విడుదల చేయాలి అని స్పష్టంగా ఉన్నా... జైలు అధికారులు పాటించలేదని నిప్పులు చెరిగారు. ఇందుకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.   హైకోర్టు ఆదేశాలను విస్మరించడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి.

కాగా కాసేపటి క్రితమే అల్లు అర్జున్.. చంచల్‌ గూడ జైలు నుంచి రిలీజ్‌ కావడం జరిగింది.  జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లిన అల్లు అర్జున్...అక్కడే ఉన్నారు. దీంతో గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకుంటున్నారు సినీ ప్రముఖులు. అభిమానులు తరలి రావడంతో జైలు వెనక గేటు నుంచి వెళ్లిపోయారట అల్లు అర్జున్. మరికాసేపట్లోనే ఇంటికి కూడా వెళతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: