అల్లు అర్జున్‌కు అర్ధరాత్రి షాక్... అసలేం జరిగింది...?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ ... స్టార్ హీరో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడం.. నాంపల్లి కోర్టుకు తరలించడం.. ఆ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ విషయం లో పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు ఈ విషయం లో నడిచిన హై డ్రామా అంతా ఇంతా కాదు. చివరకు పోలీసులు ఆయన ను చంచల్‌గూడ జైలుకు తరలించడం జరిగింది .. ఇలా చాలా తక్కువ సమయంలోనే అల్లు అర్జున్ జైలుకు వెళ్లాడు. అయితే, ఆ వెంటనే హై కోర్టు ఆయన కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పుష్ప గాడి అభిమాను లతో పాటు అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ఇంకేం ఉంది ? అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అవ్వడం ఒక్కటే మిగిలి ఉంది అని అందరూ సంతోషం గా ఉన్న టైంలో ఒక్కసారిగా అర్ధరాత్రి షాక్ తగిలింది. అభిమానుల సంతోషం ఎక్కువ సేపు లేదు .. వెంటనే ఆవిరి అయిపోయింది. అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా , అల్లు అర్జున్ మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు. పోలీస్ అధికారులు తమకు ఇంకా బెయిల్ కాపీ రాలేదని చెప్పడం తో పాటు తమకు అందిన కాపీలో తప్పులు ఉన్నాయని .. సరైన బెయిల్ కాపీ వచ్చాకే అల్లు అర్జున్ను విడుదల చేస్తామని వారు తెలిపారు. దీంతో శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ జైల్లో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక శనివారం ఉదయం అల్లు అర్జున్ 7 గంటలకు జైలు నుంచి విడుదల య్యారు. దీంతో ఎట్టకేలకు ఒక రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.