ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు అయినటువంటి శిల్ప రెడ్డి కి మద్దతుగా నంద్యాల వెళ్లి మరి ఆయనకు సపోర్టుగా నిలిచాడు. శిల్పా రెడ్డి నంద్యాల నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా భరిలో దిగాడు. ఇక తన ఇంట్లో వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా జనసేన నుండి బరిలోకి దిగాడు. ఆయనను కాదు అని చెప్పి శిల్పా రెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్లి మరి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో జనసేన కార్యకర్తలు , అభిమానులు , మెగా అభిమానులు ఆ సమయంలో ఆయనపై మండిపడ్డారు.
దానితో ఒకానొక ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అల్లు అర్జున్ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ ... నాకు ఇష్టం అయితే వస్తా. నచ్చిందే చేస్తా అనే డైలాగ్ కొట్టాడు. దీనితో ఈ డైలాగ్ ఇన్ డైరెక్ట్ గా జనసేన పార్టీకి కాకుండా శిల్పారెడ్డికి సపోర్టుగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి సపోర్ట్ చేయడంపై వ్యతిరేకత రావడంతో దానిపై ఈ డైలాగులు ఇన్ డైరెక్టుగా కొట్టాడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. అలాగే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను ముద్దుగా నా ఆర్మీ అంటూ పిలుస్తూ వస్తున్నాడు. నా ఆర్మీ నా కోసం ఏదైనా చేస్తోంది. వారు ఉండగా నాకు ఎదురేలేదు అని ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ ప్రీమియర్స్ లో భాగంగా అల్లు అర్జున్ హైదరాబాదులోని సంధ్య థియేటర్ కు వెళ్లాడు. అక్కడ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దానితో అల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేశారు.
ఇక ఈయన అరెస్టు ఆయన వెంటనే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎంతో మంది వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం జరిగింది. దానితో మెగా అభిమానులు ఈ సమయంలో మీ ఆర్మీ రాదు. నువ్వు వెళ్లి సపోర్ట్ చేసిన శిల్పా రాడు. నీకు ఇష్టం అయితేనే వస్తా ... నచ్చిందే చేస్తా అనే డైలాగ్స్ వల్ల ఉపయోగం లేదు అంటూ మెగా అభిమానులు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.