అల్లు అర్జున్ కి బెయిల్ రావడం కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా..?

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసిన సరే అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు పుష్ప 2 సినిమా కారణంగానే ఆయన పేరు బాగా వినిపించింది. ఇప్పుడు కూడా ఆ సినిమా కారణంగానే బన్నీ ఎదురుకున్న ప్రాబ్లమ్‌స్ వైరల్ అవుతున్నాయి. నిన్న మార్నింగ్ నుండి బన్నీ లైఫ్ లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని నేషనల్ అవార్డు అందుకున్న హీరో జైలుకు వెళ్లబోతున్నాడు అని అని తెలిసి షాక్ అయిపోయారు.  బన్నీ అభిమానుల గుండెలు బద్దలైపోయాయి.  అయితే లాయర్ నిరంజన్ రెడ్డి తన తెలివితో చక్కగా వ్యవహరించి  ప్రవర్తించి బన్నీకి బెయిల్ వచ్చేలా చేసాడు .


అయితే నిరంజన్ రెడ్డి సలహా తీసుకోమంటూ అల్లు అరవింద్ కి  సజెస్ట్ చేసింది మెగాస్టార్ చిరంజీవి అంటూ బాగా ఓ వార్త ట్రెండ్ అవుతుంది .  కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వారు జరుగుతుంది అంటూ అందరికీ తెలిసిందే. పుష్ప2 పై ఇప్పటికి కూడా మెగా హీరోస్ స్పందించలేదు.  కానీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అని తెలియగానే నాగబాబు - వరుణ్ తేజ్ - సురేఖ - మెగాస్టార్ చిరంజీవి అందరూ కూడా హుటాహుటిన అల్లు అరవింద్ ఇంటికి చేరుకొని స్నేహారెడ్డికి ధైర్యం చెప్పారు .


ఆ విజువల్స్ కూడా వైరల్ గా మారాయి . అయితే మెగాస్టార్ చిరంజీవి కారణంగానే నిరంజన్ రెడ్డి ..అల్లు అర్జున్ కేసు టేకప్ చేశారు అని ..ఇప్పుడు బెయిల్ రావడానికి పరోక్షకంగా కారణమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కానీ వైసిపి జగన్ కి నిరంజన్ రెడ్డి జాన్ జిగి దోస్త్ అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.అంతేకాదు నిరంజన్ రెడ్డికి బాగా కోట్లు ఖర్చుపెట్టి మరి అల్లు ఫ్యామిలీ బెయిల్ తెప్పించుకుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అర్థరాత్రి ఎంత హైదరాబాద్ చంచల్ గూడా జైల్లోనే బన్నీ ఉండిపోయాడు అన్న విషయం అందరికి తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: