అల్లు అర్జున్ అరెస్ట్.. ఆ ఆర్మీ ఎక్కడయ్యా?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ కి చాలా మంది అభిమానులు వచ్చారు. దీంతో థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుతీవ్రంగా పులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ తన అభిమానులను మెగా ఫాన్స్ అని కాకుండా అల్లు ఆర్మీ అని పిలవడం జరిగింది. బన్నీ ఎక్కడికి వెళ్లిన.. అది ముంబై అయినా, కేరళ అయినా తాను అలాగే సంబోధించాడు. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన ఇంత సమయం అవుతున్న అల్లు ఆర్మీ నుండి ఇంతవరకు పెద్దగా నిరసనలు, ధర్నాలు లేవు. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో అల్లు అర్జున్ కి సపోర్ట్ కనిపించపోవడం చాలా మందిని ఆశ్చర్యపరించింది. దీంతో తమ అభిమానం నుండి విడిపోవాలి అనుకున్న అల్లు అర్జున్ నిర్ణయాన్ని మెగా అభిమానులు తమ హీరో అరెస్టయి జైలుకెళ్తున్నప్పుడు అల్లు ఆర్మీ ఎక్కడుంది అంటూ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చూపించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: