అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది అతని అభిమానే ?
అల్లు అర్జున్ అంటే రాజు నాయక్‌కు ఎంతో అభిమానమట. అయనతో ఫొటో దిగాలనే బలమైన కోరిక మనసులో ఉందట. అయితే ఈ కోరిక అయన్ను అరెస్టు చేస్తూ నెరవేర్చుకోవడం ఇబ్బందికరంగా సీఐ రాజు నాయక్ భావించినట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉండగా.. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో... చంచల్ గూడ్ జైలు నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం గీతా ఆర్ట్స్ కార్యాలయం చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్.
ఈ తరుణంలోనే... భావోద్వేగానికి గురి అయ్యారు అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి. అటు పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడారు హీరో అల్లు అర్జున్. వాళ్ళ అమ్మ పిల్లల్ని ఆలింగనం చేసుకున్నారు అల్లు అర్జున్. అభిమానులకు అభివాదం చేశారు అల్లు అర్జున్. అటు గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు. మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన అల్లు అర్జున్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను బాగున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు బన్నీ. నేను చట్టాన్ని గౌరవిస్తున్నా...కోర్టులో కేసు ఉంది ఇప్పుడెం మాట్లాడనని తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన..రేవతి కుటుంబానికి నా సానుభూతి అంటూ మీడియాతో అల్లు అర్జున్ వెల్లడించారు.