సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే.ఇందులో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రెండు గంటలపాటు విచారణ జరిపిన హైకోర్టు రిమాండ్ తరలించాలని వెల్లడించింది. కానీ చివరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలోఅల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుండి శనివారం ఉదయం విడుదలయ్యారు. తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్‌కు స్వయంగా వెళ్లి.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అయితే ఆ వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది. కోర్టు ఉత్వర్వులు అప్‌లోడ్ చేసేసరికి రాత్రి 10.30 గంటలు దాటిపోవడంతో ఆయనను శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు ప్రకటించారు. దీంతో రాత్రంతా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరైన బెయిల్ పత్రాలు సమర్పించడంతో.. శుక్రవారం ఉదయం ఆయనని విడుదల చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు.మెయిన్ గేటు నుంచి కాకుండా.. ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి అల్లు అర్జున్‌ను మీడియా కంట పడకుండా పోలీసులు బయటకు తీసుకువచ్చారు. అభిమానులను అనుమతించకుండా.. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే దారిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా…గీతా ఆర్ట్స్ లోనే అల్లు అర్జున్ ఉన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అల్లు అర్జున్ .ఇదిలా ఉండగా తొలుత జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కు వెళ్ళిన అల్లు అర్జున్ ఆ తరువాత తన మామ చంద్రశేఖర్ ఇంటికి చేరుకున్నారు. నిన్న అరెస్టు తరువాత ఆయన భార్య స్నేహ పుట్టింటికి వెళ్లారు. దీంతో ఆమెను పిల్లల్ని కలిసేందుకు బన్నీ అక్కడికి వెళ్లారు వారిని తీసుకొని కొద్దిసేపట్లో తన నివాసానికి చేరుకొనున్నారు