మహేష్ నాని సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ .. ఆ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడని తెలుసా..?

Amruth kumar
మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో ఇప్పటివరకు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు .. ఇప్పుడు కొందరు స్టార్ హీరోలుగా అగ్ర నటీనటులుగా రాణిస్తున్నారు ... తేజ సజ్జ , కావ్య కళ్యాణ్ , ఆకాష్ పూరి లాంటి వాళ్ళు వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు .. ఈ కోవకు చెందిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా నటుడుగా హీరోగా మంచి సినిమాలు చేస్తున్నాడు .. మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాల్లో నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడు హీరోగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడు .. మహేష్ బాబు హీరోగా వచ్చిన నాని సినిమా ఎంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది ..

 విలక్షణ నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య తెర్కక్కించిన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు .. గొప్ప ప్రయోగాత్మక సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది .. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు .. ఈ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి అందరికీ గుర్తుండే ఉంటాడు.  ఎందుకంటే హీరో పాత్ర కనిపించిన ప్రతి సన్నివేశంలో అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు .. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు .. మహేష్ బాబు బావ‌ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా .. అవును నాని సినిమాలో నటించింది అశోక్ గల్లానే .. ఆ సినిమా తర్వాతే అతనికి సినిమాలపై ఎక్కువ ఆసక్తి పెరిగిందట ..

ఇక ఇప్పుడు అతను హీరోగా మారి వరస సినిమాలు చేస్తున్నాడు.. 2022లో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు .. హీరో పేరుతోనే మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. కోవిడ్ వేవ్లో ఆ సినిమా కొట్టుకుపోయింది .. రీసెంట్ గా ‘దేవకీ నందన వాసుదేవ’ పేరుతో మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ఈ హీరో ఈ సినిమా కూడా అతనికి పెద్దగా కలిసి రాలేదు. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా అశోక్ గల్లా కు మంచి హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: