20 ఏళ్లుగా హీరోయిన్గా చేస్తున్న నో క్రేజ్ .. ఆ హీరోలతో లవ్ రూమర్స్ .. ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..?

Amruth kumar
ఇక పైన ఫోటోలో తెల్ల గౌను ధరించి ఏంజెల్లా మెరిసిపోతున్న అమ్మాయిని ఎవరో గుర్తుపట్టారా ? ఇప్పుడు ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ .. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి ఆదరగొట్టింది .. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది .. 2005 లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ దాదాపు 40 కు పైగా సినిమాలు నటించింది.. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది .. అయితే ఈమె తన ఈఎన్నేళ్ల కెరియర్లో ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకోలేకపోయింది.. ఇప్పుడు సినిమాలను కాస్త తగ్గించేసింది .. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తుంది.  
 
ముఖ్యంగా  సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ జానర్ సంబంధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తుంది .. అంతేకాకుండా పలు సినిమాల్లో నెగిటివ్ పాత్రలో కూడా ఈమె చేస్తుంది .. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ? ఇంతకీ ఈ బ్యూటీ మరెవరో కాదు రెజీనా కాసాండ్రా .. మహేష్ బావ సుదీర్ బాబు హీరోగా వచ్చిన శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది రెజీనా .. ఆ తర్వాత సందీప్ కిషన్ తో కలిసి రొటీన్ లవ్ స్టోరీ అనే సినిమాతో యూత్ ను బాగా ఆకట్టుకుంది .. ఆ తర్వాత కొత్తజంట , రారా కృష్ణయ్య , పిల్ల నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , పవర్ , సౌఖ్యం, జో అచ్యుతానంద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ..  

వీటితో పాటు ఆ,  అడివి శేష్‌తో ఎవరూ సినిమాల్లో రెజినా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఈ సినిమాల విషయం పక్కనపడితే తనతో కలిసి నటించిన కొందరు హీరోలతో ప్రేమలో పడినట్లు ఈమెపై ఎన్నో వార్తలు వచ్చాయి .. అలాగే గతంలో ఒక ఇంటర్వ్యూలో ఓసారి అబ్బాయిలు మ్యాగీ లా రెండే నిమిషాలు అని స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లో హైలైట్ అయింది. ఇలా 33 సంవత్సరాల వచ్చిన ఇంకా సింగల్ గానే ఉంటుంది రెజీనా .. ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు ఓ తెలుగు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: