అల్లు అర్జున్ చూసి కంటతడి పెట్టుకున్న చిరు భార్య .. బన్నీ ఇంటికి తరలిన టాలీవుడ్..!
శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఈరోజు ఉదయం 7 గంటల సమయం తర్వాత అల్లు అర్జున్ విడుదల చేశారు జైలు అధికారులు .. ఆ క్రమంలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మెయిన్ గేటు నుంచి కాకుండా.. జైలు అకాడమీ గేట్ నుంచి ఆయన్ను బయటకు పంపారు .. అలాగే అల్లుఅర్జున్ జైలు నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీడియా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసు అధికారులు .. అలాగే మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎస్కార్ట్ వాహనాలను అరేంజ్ చేశారు .. అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వెళ్లే వరకు సెక్యూరిటీ కల్పించారు.
అలాగే జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిదగ్గర పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు .. బన్నీ ఇంటి దగ్గరకు అభిమానులు భారీగా రాకుండా బారికేడ్లు, పికెటింగ్ ఏర్పాట్లు చేశారు .. అదేవిధంగా అల్లుఅర్జున్ ఇంటి వైపు ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు .. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు , దర్శకులు , హీరోలు , అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు .. ఈ క్రమంలో బన్నీని చూడగానే ఎమోషనల్ అయ్యారు సుకుమార్. దీనితో అల్లు అర్జున్ ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు.