పుష్ప2 బుకింగ్స్ పై బన్నీ అరెస్ట్ ఎఫెక్ట్.. సరైన సమయం చూసి దెబ్బ కొట్టారా?

Reddy P Rajasekhar
సాధారణంగా ఏదైనా ఊహించని ఘటన జరిగితే ఆ ఘటన ఇతర అంశాలపై కూడా ఊహించని స్థాయిలో ప్రభావం చూపుతుంది. పుష్ప2 బుకింగ్స్ పై బన్నీ అరెస్ట్ ఎఫెక్ట్ పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయం చూసి బన్నీని దెబ్బ కొట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు సెకండ్ వీక్ కలెక్షన్లు కీలకమనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాకు సైతం సెకండ్ వీక్ కలెక్షన్లు ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
అయితే ఈ సినిమాకు కీలకమైన సెకండ్ వీక్ సమయంలో బన్నీని అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ దృష్టి అంతా అటువైపు వెళ్లింది. ఈ విధంగా బన్నీని ఊహించని దెబ్బ కొట్టారని చెప్పవచ్చు. పుష్ప2 కలెక్షన్ల విషయంలో దూకుడు తగ్గిందని తెలుస్తోంది. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
 
బన్నీ పుష్ప2 1500 కోట్ల రూపాయలకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ కు నార్త్ ఇండియాలో సైతం క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. పుష్ప3 సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాలో ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. 2027 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
పుష్ప ది ర్యాంపేజ్ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది ర్యాంపేజ్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పుష్ప3 సినిమాలో రష్మిక రోల్ ఉంటుందా? లేదా? అనే చర్చ సైతం జరుగుతోంది. అల్లు అర్జున్ క్రేజ్ చూసి ఇతర ఇండస్ట్రీలు సైతం షాకవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ మధ్య కాలంలో టైమ్ మాత్రం అస్సలు బాలేదని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: