అరెస్టుపై మోహన్ బాబు సంచలన ట్విట్..!
ఇక దాంతో మోహన్ బాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది .. ఇక తాజాగా దాని గురించి వస్తున్న వార్తలు పై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో మోహన్ బాబు మిస్సింగ్ అంటూ నానా రచ్చ నడుస్తున్న సమయంలో ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు .. “నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. నా గురించి అసత్యపు వార్తలు రాయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.
అయితే ఇప్పుడు మోహన్ బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు నెటిజెన్లు , ప్రజాప్రతినిధులు .. సహనం కోల్పోయి మీడియా పై దాడి చేయడం సరికాదని అంటున్నారు .. మోహన్ బాబు సంయమనం కోల్పోయి ప్రవర్తించడం సరికాదని అంటున్నారు .. మీడియా రిపోర్టర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు . మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు తీరుపై నిరసనలకు కూడా జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చారు .. తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ..