అల్లుఅర్జున్ అరెస్ట్..పుష్ప 2 కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడిందా..?

murali krishna
అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆయన అరెస్ట్ పుష్ప 2 కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందా అని టెన్షన్ పడుతున్నారు. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయాంటే..ఐకానిక్ స్టార్ అల్లు అరెస్ట్ విషయం సినీ ఇండస్ట్రీలో, పొలిటికల్ పరంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 9వ రోజు కలెక్షన్స్ స్వల్పంగా పడిపోవడం గమనార్హం.అయితే, ఇండియాలో పుష్ప 2 ది రూల్ నెట్ కలెక్షన్స్ కొంత వరకు తగ్గుతున్న అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో 9వ రోజు పడిపోయిన కలెక్షన్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పుష్ప 2 ది రూల్ సినిమాకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 36.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో అన్నిటికంటే ఎక్కువగా హిందీలో రూ. 27 కోట్లు వస్తే తెలుగులో రూ. 7.5 కోట్లు, తమిళంలో రూ. 1.35 కోట్లు, కన్నడ, మలయాళ భాషల్లో రూ. 2 లక్షలు మాత్రమే రాబట్టాడు పుష్ప రాజ్. అయితే, ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు పుష్ప 2 కలెక్షన్స్ అతి స్వల్పంగా 3.07 శాతం పడిపోయాయి.ఇక పుష్ప 2 ది రూల్ మూవీ ఇండియాలో 9 రోజుల్లో రూ. 762.1 కోట్లు కలెక్ట్ చేసినట్లు సక్నిల్క్ అంచనా వేసింది. ఈ కలెక్షన్స్‌లో కూడా హిందీ నుంచే అన్నిటికంటే ఎక్కువగా రూ. 452.1 కోట్లు ఉండటం విశేషం.

అలాగే, ఈ వసూళ్లలో తెలుగు నుంచి రూ. 249.5 కోట్లు రాగా తమిళ వెర్షన్‌కు 42.4 కోట్లు వచ్చాయి. కేరళ నుంచి 5.5 కోట్లు కలెక్ట్ కాగా మలయాళం ద్వారా రూ. 12.6 కోట్ల కలెక్షన్స్ వసూలు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.
9వ డిసెంబర్ 13 రోజున తెలుగులో పుష్ప 2 ది రూల్ మూవీకి ఓవరాల్‌గా 31.09 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అయితే, పుష్ప 2 మూవీ పదో రోజున అంటే ఇవాళ డిసెంబర్ 14 ఇండియాలో రూ. 1.85 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సక్నిల్క్ అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం పుష్ప 2 మూవీకి పది రోజుల్లో ఇండియాలో రూ. 763.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.కాగా ఇప్పటికీ 86 శాతం కలెక్షన్స్ రికవరీ సాధించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 620 కోట్లు. ఈ టార్గెట్‌ను బీట్ చేసి పుష్ప 2 ది రూల్ హిట్ కొట్టాలంటే సినిమాకు ఇంకా రూ. 91 కోట్ల కలెక్షన్స్ రావాలి. ఇక పుష్ప 2 ది రూల్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లో రూ. 1110 కోట్లు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: