పెళ్లి తర్వాత గ్లామర్ షో తో తగ్గేదేలే అంటున్న ... స్టార్ హీరోయిన్లు..!
ఎవరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది.. గత 15 సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న ఆంటోనీ తటిల్ తో గోవాలో మూడు ముళ్ళు వేయించుకుంది కీర్తి .. అయితే పెళ్లికి రెండు రోజులు ముందే ఈమె చేసిన ఫోటో షూట్ తో అందరికీ షాక్ ఇచ్చింది.. పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో గ్లామర్ షో తో మరింత హీట్ పెంచేసింది కీర్తి .. బాలీవుడ్ లో తొలిసారిగా నటిస్తున్న బేబీ జాన్ లో ఇప్పటివరకు చూడని గ్లామర్ షో తో కనిపించబోతుంది కీర్తి సురేష్ .. అదేవిధంగా మరో హీరోయిన్ రకుల్ కూడా గత సంవత్సరమే ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్నాక కూడా గ్లామర్ డోస్ మరింత పెంచేసేంది .. ఇప్పుడు తన కొత్త హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సైతం భార్యగా మారాక మరింత రెచ్చిపోతుంది .. సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న కియారా .. పెళ్లి తర్వాత కూడా లిప్ లాక్ సీన్స్ , బెడ్ రూమ్ సీన్స్ తో గ్లామర్ షోలో హద్దులే చెరిపేస్తూ హాట్ బ్యూటీగా మారిపోయింది. వీరందరూ లాగే బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ భార్య అలియా భట్ సైతం గ్లామర్ షోలో తగ్గితేలే అంటుంది .. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్ , దీపికా పదుకొనే గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. ఇలా పెళ్లితో ఇంటిపేరు మారుతుందేమో గాని గ్లామర్ షో తో మార్పు లేదంటూ .. అంతకుమించిన హాట్ షో తో రెచ్చిపోతున్నారు.