విడుదలైన వెంటనే అల్లు అర్జున్ కలిసింది ఈయన్నే.. 45 నిమిషాల పాటు భేటీ?
కాగా చంచల్ గూడ సెంట్రల్ జైలు అధికారుల తీరుపై అల్లు అర్జున్ తరఫు న్యాయవాది జీ అశోక్ రెడ్డి తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటం చేస్తామని, లీగల్‌గా ఎలా ముందుకు వెళ్లాలో బాగా తెలుసని అన్నారు. అయితే అల్లు అర్జున్ విడుదలవుతున్నారనే వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానుల మధ్య పెద్ద సంఖ్యలో చంచల్ గూడ జైలు వద్దకు చేరుకొని తమ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో ప్రధాన గేటు వద్ద అల్లు అర్జున్ రాకకోసం ఎదురు చూసారు. ఆ సమయంలో ఆయనను ప్రధాన గేటు నుంచి తీసుకెళ్లడం సరికాదని భావించిన పోలీసులు జైలు వెనుక ద్వారం నుంచి విడుదల చేయడం జరిగింది.
చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకొని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అప్పటికే తన కోసం ఎదురు చూస్తోన్న సీనియర్ అడ్వొకేట్లు నిరంజన్ రెడ్డి, జీ అశోక్ రెడ్డి, కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది. అందరికంటే ముందు నిరంజన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 45 నిమిషాల పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఆయనతో మాట్లాడారు. నిరంజన్ రెడ్డితో పాటుగా జీ అశోక్ రెడ్డి, వారి టీమ్, కొందరు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడారు. ఇది నాలుగు వారాల మధ్యంతరం కావడం వల్ల రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించాలని విజ్ఙప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా నిరంజన్ రెడ్డి చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసినదే. అల్లు అర్జున్ తొందరగా విడుదల కావడం వెనుక చిరు హస్తం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు.