ట్రైలర్: మళ్లీ సెంటిమెంట్ నే నమ్ముకున్న అల్లరి నరేష్.. బచ్చలమల్లి ట్రైలర్ రివ్యూ..!

Divya
ఈమధ్య కాలంలో అల్లరి నరేష్ కామెడీ సినిమాలను వదిలిపెట్టి మరి విభిన్నమైన కథాంశాలతో ఉండే సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలాగే పలు చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ బాగానే పేరు సంపాదించారు. ముఖ్యంగా అల్లరి నరేష్ తనకేటప్పుడు మార్చి వైలెన్స్ వైపుగా ఎక్కువగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.. అలా ఇప్పుడు తాజాగా అల్లరి నరేష్ అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా బచ్చలమల్లి . డైరెక్టర్ సుబ్బా మంగదేవి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే హీరో నాని చేతుల మీదుగా విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. అల్లరి నరేష్ నీ యాక్సిడెంట్ గా కొట్టి పడేసినట్లు చూపిస్తారు. ఆ తర్వాత నటుడు రావు రమేష్ ఏమవుతాడమ్మ  నీకు అని అడగగా బ్యాగ్రౌండ్ వాయిస్ నుంచి చినాన్న అవ్వుతాడనే వాయిస్ వినిపిస్తుంది. అలా రావు రమేష్ మీ చిన్నాన్న ఎక్కడ కలిశానో తెలుసా అమ్మ అని చెబుతూ ట్రైలర్ ని మొదలు పెడతారు.. అల్లరి నరేష్ ఇందులో మరొకసారి చాలా మాస్ హీరోగా  కనిపించబోతున్నారు. హరితేజ ఇందులో కీలకమైన పాత్రల నటిస్తోంది.

హీరోయిన్గా అమృత అయ్యర్ నటిస్తూ ఉండగా.. అల్లరి నరేష్, అమృత అయ్యర్ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా వీరిద్దరి మధ్య చూపించే లవ్ సన్నివేశాలు కూడా పర్వాలేదు అనిపించుకుంటున్నాయి.. అలాగే తల్లి సెంటిమెంటును కూడా ఇందులో చూపించారు.. అయితే ప్రేమలో ఉన్నప్పుడే సడన్గా ఒక ట్విస్ట్ ఎదురవుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు.. మరి మొత్తానికి ఆర్టిస్ట్ ఏంటి అన్నది తెలియాలి అంటే డిసెంబర్ 20వ తేదీ వరకు ఆగాల్సిందే.. ఇందులో కమెడియన్ సత్య తో పాటు పలువురు నటీనటులు నటించారు. మొత్తానికి మరొకసారి అల్లరి నరేష్ సెంటిమెంట్ ని నమ్ముకున్నారు మరి ఏ విధంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: