అల్లు అర్జున్ కు సీఎం చంద్రబాబు ఫోన్ కాల్!

Veldandi Saikiran
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న జైలు పాలు అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో... ఓ మహిళ మృతి చెందింది. ఈ మరణానికి... అల్లు అర్జున్ కూడా కారణం అంటూ కేసు నమోదు అయింది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు...అరెస్టు చేశారు. నిన్న ఉదయం 10 సమయంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు.. అనంతరం కోర్టులో హాజరు పరచడం కూడా అయింది. అయితే... మొదట 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించారు. కానీ ఆ తర్వాత... అల్లు అర్జున్ కు బెయిల్ రావడం జరిగింది.  అయితే బెయిల్ ఆన్లైన్లో అప్డేట్ చేయడం లేదు కావడంతో.. రాత్రంతా చంచల్ గూడ సెంట్రల్ జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నాడు.
 ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఇక అల్లు అర్జున్ ఇంటికి రావడంతో చాలామంది సినీ సెలబ్రిటీలు... ఆయనను కలిసి ఓదార్చుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా... ప్రత్యేకంగా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. జైలు నుంచి  బయటికి వచ్చారు ఇక భయం లేదు అంటూ చంద్రబాబు పేర్కొన్నారట.
అటు నిన్న అల్లు అరవింద్ కు కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేయడం జరిగింది.  దీనికి సంబంధించిన విషయం ఇప్పుడు  వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా అటు అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ప్రభాస్ ఫోన్ చేశారు.  ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను పరామర్శించారు ప్రభాస్ అలాగే ఎన్టీఆర్. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  అలాగే పుష్ప 2   సినిమా... మంచి కలెక్షన్లు వచ్చిన నేపథ్యంలో శుభాకాంక్షలు కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: