పవర్ ఫుల్ లిరిక్స్ తో హైప్ పెంచేస్తున్న 'డాకు మహారాజ్'.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ నటసింహం నందమూరి  బాలకృష్ణ,డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'డాకు మహారాజ్'. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి బాలయ్య లుక్ రిలీజ్ చేసిన నుండి అభిమానులలో ఉత్సహం పెరిగిపోయింది.ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో బాబీ చూపిస్తున్నారు.తమ అభిమాన నటుడిని కొత్త లుక్ లో చూపిస్తున్నందుకు డైరెక్టర్ బాబీను కొనిడుతున్నారు.ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన 'డాకుస్‌ రేజ్‌' ప్రోమో అదిరి పోయిందనేలోపే ఈరోజు లిరికల్ సాంగ్ తో బాలయ్య దుమ్ము దులిపేశారు.అయితే ఈ మూవీకు తమన్ అందించిన బీజీఎమ్‌తో ఫిదా కావాల్సిందే అనేలా ఈ సాంగ్‌ ఉంది.ఈ సాంగ్‌కు అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా నాకాశ్‌ అజీజ్‌ ఆలపించారు.

 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ 'ది రేజ్ ఆఫ్ డాకు' పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. 'డేగ డేగ దేకో దేకో బేగ..గుర్రం పైన సింహం చేసే సవారీ ఇదేగా' అని సాగే పవర్ ఫుల్ లిరిక్స్ అభిమానులందరిలో మూవీ పై ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలోతెగ వైరల్‌ అవుతుంది . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా డాకు మహారాజ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్స్‌లో విడుదల కానుంది.అయితే మేకర్స్‌ యూఎస్‌ఏ టెక్సాస్‌లోని డల్లాస్‌లో 2025 జనవరి 4న టెక్సస్ ట్రస్ట్ సియూ థియేటర్లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 అనే సినిమాని కూడా చేయడానికి సిద్దం అయినట్లు ఇటీవల డేట్ కూడా లాక్ చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య బాబు రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు అలాగే వరుస దూకుడు మీదున్న బాలయ్య మూవీ కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: