వావ్: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..SSMB 29 లో గ్లోబల్ స్టార్ హీరోయిన్..!
మాజీ మిస్ వరల్డ్ గా, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గ్లోబల్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. ఈమె కేవలం హాలీవుడ్ చిత్రాలలో మాత్రమే నటిస్తోంది. ఈమధ్య అసలు బాలీవుడ్ చిత్రాలలో నటించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు మేకోవర్ ఈ సినిమా కోసం మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ కేటగిరీలో తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి తండ్రి ఇదివరకే ఎన్నోసార్లు తెలియజేశారు సుమారుగా 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తీయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది ప్రియాంక చోప్రా చివరిగా స్కై ఇస్ పింక్ అనే సినిమాలు నటించిన మళ్లీ చాలా గ్యాప్ తర్వాత నటిస్తే మహేష్, రాజమౌళి కాంబోలో నటించే అవకాశం ఉన్నది. ఇది కనుక ఓకే అయితే కచ్చితంగా ప్రియాంక చోప్రా కు ఇది జాక్ పాట్ అని చెప్పవచ్చు.