బన్నిని కావాలనే తొక్కేస్తున్నారా.. రిటర్న్ గిఫ్ట్ పై.. డైరెక్టర్ హాట్ కామెంట్స్..!
చాలామంది కావాలని ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్టు చేసిందనే విధంగా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ బెయిల్ మీద నిన్నటి రోజున ఉదయం బయటికి రావడంతో చాలామంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నారు. వర్మ మరొకసారి ట్వీట్ చేస్తూ తెలంగాణకు చెందిన అల్లు అర్జున్ ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాన్ని అందించారు.. రాష్ట్రానికి ఒక గొప్ప బహుమతిని అందించారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ కి సైతం జైలుకు పంపించి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ వర్మ ట్వీట్ చేయడం జరిగింది.
నేషనల్ అవార్డుతో తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ లో చాటిన అల్లు అర్జున్ తీసుకువెళ్లారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇన్నేళ్లలో తెలుగు సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డు అందుకున్నటువంటి ఏకైక హీరో అల్లు అర్జున్నే.. పుష్ప సినిమాతో కూడా బాలీవుడ్ లో తన స్టామినా చూపించాడు అల్లు అంతటి స్టార్డం ఉన్నటువంటి హీరో అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు మొత్తం షాక్ అయ్యాయని తెలియజేశారు. మొత్తానికి వర్మ తెలంగాణకు అల్లు అర్జున్ ఒక గిఫ్ట్ ఇస్తే కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అరెస్టు చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందా అన్నట్టుగా సెటైర్ వేసినట్లు కనిపిస్తోంది.