అల్లు అర్జున్‌ను ప్లాన్ చేసి ఇరికించారు... ప్రముఖ సింగర్ కామెంట్స్ ?
తాజాగా... అల్లు అర్జున్ అరెస్టు పైన ప్రెస్ క్లబ్లో... ప్రెస్ మీట్ పెట్టి సింగర్ కల్పన హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ కు అండగా నిలిచారు కల్పన. హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఉందని ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ ఫ్రైడ్ లాంటి హీరోను ఏదో దొంగతనం చేసిన నిందితుడిలా అరెస్టు చేయడం దారుణం అన్నారు. పెద్ద క్రైమ్ చేసినట్లు... అన్యాయంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని మండిపడ్డారు.
అల్లు అర్జున్ బెడ్ రూమ్ లోకి వెళ్లి... అరెస్టు చేయడం దారుణమన్నారు. ఒక నేషనల్ అవార్డు గ్రహీత... హీరో అయిన అల్లు అర్జున్ ను ఇలా అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని... ఇది సరైన చర్య కాదన్నారు. ఇది న్యాయం కాదు... కచ్చితంగా దీనిపై పోరాటం చేస్తామని కల్పన హెచ్చరించారు. అయితే సింగర్ కల్పన చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
మరి సింగర్ కల్పన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా నిన్న ఉదయం అల్లు అర్జున్.... చంచల్గూడా జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఒక రోజు రాత్రంతా చంచల్ గూడా జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ బెయిల్ వచ్చినప్పటికీ ఆన్లైన్లో ఎక్కలేదని... ఒకరోజు అందులోనే ఉంచారు.