"క" ఎఫెక్ట్ రెమ్యూనరేషన్ డబల్ చేసిన కిరణ్ అబ్బవరం .. ఇప్పుడెంతో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన వరుస పెట్టి అనేక సినిమాలలో నటించాడు. అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ నటుడు "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఏకంగా 50 కోట్లకు పైగా  కలెక్షన్లను కూడా వసూలు చేయడంతో ఈ హీరో స్థాయి కూడా భారీగా పెరిగింది. దానితో ఈ నటుడు తన తదుపరి మూవీలకు రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

"క" సినిమా మంచి విజయం సాధించడంతో ఈ యువ నటుడు ఏకంగా తన పారితోషకాన్ని 2 కోట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఈయన సినిమాకు 3 నుండి 4 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకోగా "క" సినిమా విజయం సాధించడంతో ఒక్కో సినిమాకు ఈయన 6 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు దిల్ రుబా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా మరి కొంత కాలం లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: