మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ , ఎస్ ఎస్ రాజమౌళి క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగింది. ఇకపోతే ఈ సినిమా కథను మొదట రామ్ చరణ్ కు కాకుండా మరో హీరోకు వినిపించారట. ఆయన మాత్రం ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. మరి ఆ హీరో ఎవరు ..? ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.
చాలా సంవత్సరాల క్రితం విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథను సూపర్ స్టార్ కృష్ణ కోసం తయారు చేశారట. అందులో భాగంగా కృష్ణ గారికి ఈ సినిమా కథను కూడా విజయేంద్ర ప్రసాద్ వినిపించాడట. ఇక కథ మొత్తం విన్న కృష్ణ ఈ సినిమా స్టోరీని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. దానితో విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా కథను పక్కన పెట్టేసాడట. కానీ రాజమౌళి కి మాత్రం ఆ కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ హీరో గా మగధీర అనే టైటిల్ తో మూవీ ని రూపొందించాడట. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా కృష్ణ గారి కోసం రాసుకున్న కథలో రామ్ చరణ్ హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.