పుష్ప 2 సంథ్య థియేటర్ ఘటన.. బాలుడి కోసం స్టార్ ప్రొడ్యుసర్ సంచలన నిర్ణయం...!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఒకరోజు ముందుగానే ప్రపంచ వ్యాప్తంగా పరిచోట్ల ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ తోని సంధ్యా థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షో జరిగింది తన ప్రతి సినిమాకు వెళ్లినట్టుగానే ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లిన క్రమంలో అక్కడ అభిమానులు మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే రేవతి అనే 39 సంవత్సరాల మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థత కు గురై హైదరాబాదులో ప్రాణాపాయ స్థితిలో ఓ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలిసిన అల్లు అర్జున్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు చనిపోయిన మహిళలకు సంతాపం తెలియజేస్తూ .. ఆ కుటుంబానికి తనవంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు.
అలాగే ఆ కుటుంబానికి ఏ విషయంలో అయినా అండగా ఉంటానని తెలిపారు. ఆ బాలుడికి కావలసిన వైద్య సదుపాయాల ఖర్చు అంతా తానే చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పటం జరిగింది. అయితే ఈ రోజు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ప్రధాన వ్యక్తి గీతా లో భాగస్వామి ... అల్లు అర్జున్ కు అత్యంత ఆప్తుడైన బన్నీ వాస్ ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన మహిళలకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారికి ఏ విషయంలో అయినా తాము అండగా ఉంటామని హాస్పిటల్ కు సంబంధించిన ఖర్చు అంతా భరిస్తాం అని నిర్మాత బన్నీ వాస్ హామీ ఇచ్చారు.