అల్లు అర్జున్ అరెస్టు చ‌ట్టం ప‌ని కాదా.. అంత పెద్ద క‌థ న‌డిచిందా ..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందని ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన వద్ద హోంశాఖ ఉంది కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని అరెస్టు సమర్ధించారు. మధ్యంతర బెయిలు వచ్చినా కూడా ఓ రోజు కచ్చితంగా జైలులో ఉంచడంతో చట్టం ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందా అన్న చర్చలు కూడా ఉన్నాయి. అయితే చట్టం ఎంత పవర్ ఫుల్గా పనిచేయటానికి ఏదో బలమైన కారణం ఉందని ఓ బలమైన శక్తి ప్రభావం ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అన్న చర్చలు సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అర్జున్‌ని అరెస్టు చేస్తారన్న ప్రచారం ఆస్తులు లేదు. అసలు అలాంటి ప్రయత్నం ఉంటుందని కూడా ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అర్జున్ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టుకు వెళ్లారు. గతంలో నంద్యాలలో ఇలాగే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. దాంతో ఈ కేసులోను ఆయనకు మెరిట్ ఉంటుందని అనుకున్నారు. సహజంగా న్యాయస్థానాల్లో ఇలాంటి పిటిషన్ ఉన్నప్పుడు సెలబ్రిటీలు .. ప్రముఖ వ్యక్తులని చట్టాలు అరెస్టు చేయడానికి సాహసించవు .. కానీ అర్జున విషయంలో అది జరగలేదు .. అరెస్టు చేశారు.

అర్జున్ త‌న‌కు ఉన్న హై ప్రొఫైల్ సోర్సులు వాడి ఒకటికి రెండు కోర్టులలో వివిధ మార్గాలలో ప్రయత్నించి బెయిల్ వచ్చేలా సక్సెస్ అయ్యారు .కానీ ఆయనను ఒకరోజు ఆయన జైలులో ఉంచాలన్న చట్టం పట్టుద ల ముందు విఫలమయ్యారు. ఆయ‌న‌ ఓ రోజంతా జైల్లో ఉండాల్సి వచ్చింది. చట్టం ముందు అందరూ సమానమే కానీ ఇలాంటి అరెస్టులు న్యాయాలు సెలబ్రిటీలకు సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళకు ఎంత స్పెషల్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్టు  కు కేవలం తొక్కిస‌లాట ఘటన కారణం కాదని అంతకుమించి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: