"మోక్షజ్ఞ" సినిమాలో పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్.. ఇక మొత్తం రచ్చ రంబోలానే..!?

Thota Jaya Madhuri
మోక్షజ్ఞ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని మరి ఎదురుచూస్తున్నారు .అయితే ఫైనల్లీ ఆ ఛాన్స్ ను ప్రశాంత్ వర్మకి ఇచ్చాడు బాలకృష్ణ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ ఇవ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా కోసం చాలా చాలా ప్లాన్స్ నే వేస్తున్నారు మోక్షజ్ఞ అదే విధంగా బాలయ్య . ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీ స్ధాయిలో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.


కాగా రీసెంట్గా ఈ సినిమా నుంచి ఒక అద్దిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది . ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో ఇలియానా కూడా నటించబోతుందట . ఇది విని అభిమానులు షాక్ అయిపోతున్నారు . మొదటగా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఇలియానాను చూస్ చేసుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ వరం. కానీ ఆ తర్వాత బాలయ్య సజెషన్ తో నెగిటివ్ పాత్ర కాకుండా సినిమాని మలుపు తిప్పే పాత్ర కోసం ఇలియానని సెలెక్ట్ చేశారట.


సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇలియానా తెలుగు సినిమా ఓకే చేసి చాలా కాలమే అవుతుంది. ఇన్నాళ్లకు ఇలియానా మళ్ళీ తెలుగు సినిమాని ఓకే చేసింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఆయన అభిమానులు ఫుల్ ఫుల్ ఖుషి అవుతున్నారు. "దేవదాసు" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఇలియానా .. తర్వాత ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఏలేస్సిందో మనం చూస్తున్నాం . అయితే సడన్ గా ఆమెకి అవకాశాలు తగ్గాయి . ఆ తర్వాత పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి సోషల్ మీడియాలో తన పేరు గబ్బు లేపుకునేలా చేసింది . ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాలో అవకాశం రావడంతో ఆమె పేరు మారుమ్రోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: