2004 వ సంవత్సరం కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్న ఓ మూడు సినిమాల రిజల్ట్ మాత్రం కోలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. ఆ సినిమాలు ఏవి ..? అవి ఎలాంటి రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ సంవత్సరం మొదటగా లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. జైలర్ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత రజిని నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సంవత్సరం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి భారీ విజయం సాధించిన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడం , విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కమల్ నటించిన సినిమా కావడం , శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంతరాలు పెట్టుకున్నారు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే సూర్య తాజాగా శివ దర్శకత్వంలో కాంగువ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ మూడు సినిమాలు ఏకంగా భారీ డిజాస్టర్స్ కావడంతో ఒక్క సారిగా కోలీవుడ్ ఇండస్ట్రీకి ఈ మూడు సినిమాల ద్వారా పెద్ద షాక్ తగిలింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.