"డాకు మహారాజ్"కి డోకానే లేదా.. ఒక్క పాటతో అంతా చెప్పేశారు..?

frame "డాకు మహారాజ్"కి డోకానే లేదా.. ఒక్క పాటతో అంతా చెప్పేశారు..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వసి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించనుండగా ... బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లను మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు. ఇక నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ ద్వారా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కొంత కథను కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ద్వారా ఈ మూవీ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ఓ వైవిధ్యమైన గెటప్ లో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడం అలాగే ఈ సాంగ్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో తెలియజెప్పే ప్రయత్నం కూడా ఈ మూవీ యూనిట్ చేయడంతో ఈ మూవీ యూనిట్ పై ప్రస్తుతం బాలయ్య అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: