నైజాంలో రచ్చ చేస్తున్న పుష్ప.. ఇప్పటికి ఎంత వచ్చిందో తెలుసా..?

frame నైజాంలో రచ్చ చేస్తున్న పుష్ప.. ఇప్పటికి ఎంత వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ ని నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీనే కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించారు.

ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ రావడంతో ఈ మూవీ కి డిసెంబర్ 5 వ తేదీ నుండే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే మరి ముఖ్యంగా ఈ సినిమాకు నైజాం ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు నైజాం ఏరియాలో ఈ సినిమాకు 77.78 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కేవలం 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ ఏరియాలో ఈ మూవీ భారీ మొత్తంలో కలక్షన్లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా నైజాం ఏరియాలో మంచి హోల్డ్ ను కనబరిస్తోంది.

దానితో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ నైజాం ఏరియాలో అత్యంత పెద్ద మొత్తం కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని అల్లు అర్జున్ , రష్మిక నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించగా ... శ్రీ లీల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ముద్దు గుమ్మ స్పెషల్ సాంగ్ కి కూడా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: