2024లో తెలుగు నుండి వచ్చిన వందకోట్ల సినిమాలు ఇవే.. టాలీవుడ్ సత్తా ఇది..?

frame 2024లో తెలుగు నుండి వచ్చిన వందకోట్ల సినిమాలు ఇవే.. టాలీవుడ్ సత్తా ఇది..?

Pulgam Srinivas
2024 వ సంవత్సరం విడుదల అయిన టాలీవుడ్ సినిమాలలో ఏ మూవీలు 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి అనే వివరాలను తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే 1110 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమా ప్రస్తుతం కూడా మంచి  హోల్డ్ ను కనబరుస్తుంది. దానితో ఈ మూవీ మరికొన్ని రోజులు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 1061.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. 

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 450 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా 296.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా 184.05 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. 

సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 130 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ మూవీ 114 కోట్ల  కలెక్షన్లను రాబట్టింది. నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: