టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమైంది..? వరుసగా స్టార్ సెలబ్రిటీస్ అవమానపడడానికి కారణం అదేనా..?
కానీ పుష్ప సినిమాతో అది మరింత పెరిగింది. బన్నీ అంటే పడని వాళ్లు కూడా పుష్ప 2 సినిమాని చూసి ఓ రేంజ్ లో పొగిడేశారు. ఇక పుష్ప 2 సినిమాతో అసలు మాటల్లేవ్ మాట్లాడుకోవడం లేవు అంటూ రికార్డ్స్ బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు . ఏకంగా ఇండియన్ హిస్టరీ లోనే ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డును క్రియేట్ చేసింది పుష్ప2 మూవీ. రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు దాటేసి సంచలన రికార్డును క్రియేట్ చేసింది .
దీనితో దేశవ్యాప్తంగా బన్నీ పేరు మారుమ్రోగిపోయింది. కాగా ఇప్పుడు బన్నీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఊహించని చిక్కుల్లో ఇరుక్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇది బన్నీ కెరీర్ లోనే మర్చిపోలేని మచ్చగా మిగిలిపోతుంది అంటున్నారు జనాలు. అయితే మోహన్ బాబు కూడా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడు . ఆ విషయం మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఎందుకు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలా ఊహించడు చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు..? టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ప్రపంచ దేశాలకు సైతం ఒక స్పెషల్ గుర్తింపు ఉంది. మరి ఎందుకు స్టార్ సెలబ్రిటీస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇబ్బందులకు గురి అవుతున్నారు ..? టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏదైనా శాపం పట్టి పీడిస్తుందా ..? ఏదైనా పరిహార పూజలు చేయాలన్న విధంగా మాట్లాడుకుంటున్నారు..?