ఆ హీరో బలవంతం...సెట్‌ లోనే అవమానించిన నయనతార...?

frame ఆ హీరో బలవంతం...సెట్‌ లోనే అవమానించిన నయనతార...?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ నయనతార ముందు వరుసలో ఉంటారు. ఓవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తోంది. భారతదేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీనటులలో నయనతార ఒకరు. సినిమాలలో మాత్రమే కాకుండా యాడ్ షూట్స్ లలో భారీగా డబ్బులను సంపాదిస్తోంది.

ఈ బ్యూటీ పుట్టి పెరిగింది మలయాళ కుటుంబంలో అయినప్పటికీ తాను మలయాళం పూర్తిగా అర్థం చేసుకోలేదు. తనకు తమిళం భాష బాగా వచ్చు. తనకు ఉన్న పెద్ద సమస్య లాంగ్వేజ్ అర్థం చేసుకోకపోవడం. ఈ సమస్య కారణంగా నయనతార ఓసారి సెట్ లో చాలా ఇబ్బంది పడిందట. అది కూడా మోహన్ లాల్ సినిమా. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు భాష అర్థం కాకపోవడంతో మోహన్ లాల్ పైన సీరియస్ అయిందట.

భాష అర్థం కానప్పుడు దానికి ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అంటూ ఎదురు ప్రశ్నించిందట. చివరకు తన ముఖంలో నిరాశకు మోహన్ లాల్ సహా ప్రతి ఒక్కరు నవ్వుకున్నారట. ఆ సమయంలో నయనతార చాలా ఇబ్బంది పడ్డారని తెలియజేసింది. చివరికి దర్శకుడు రెస్ట్ తీసుకో అమ్మ అని చెప్పి పంపించారట. ఆ తర్వాత నయనతార కాస్త రెస్ట్ తీసుకొని అనంతరం మళ్లీ షూట్ లో పాల్గొన్నదట. తనకు భాష ఉండడం వల్లనే ఎక్కువగా ఇబ్బంది పడతానని చాలా సందర్భాలలో వెల్లడించింది.
ఇదిలా ఉండగా.... నయనతార ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని భారీగా డబ్బులను సంపాదించింది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా అలానే వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తుంది. కాగా, విగ్నేష్ శివన్, నయనతార జంటకు ఇద్దరూ మగ కవల పిల్లలు ఉన్నారు. వారితో కలిసి నయనతార సమయము గడుపుతూ ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: