మితిమీరిన అభిమానానికి స్టార్స్ చెక్.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు..!?

frame మితిమీరిన అభిమానానికి స్టార్స్ చెక్.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు..!?

Thota Jaya Madhuri
స్టార్స్ కీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క స్టార్ ఆయనకు తగ్గిన రేంజ్ లోనే ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుని ఉంటారు . అయితే ఇప్పుడు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ అంటేనే గజగజ వణికి పోయే పరిస్థితి దాపురించింది . దానికి కారణం మనం చూస్తూనే ఉన్నాం.  అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు అంటే దానికి కారణం కేవలం ఫ్యాన్స్ అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు . యస్.. కేవలం బన్నీ ఫ్యాన్స్ కారణం గానే ఇన్ని ప్రాబ్లమ్‌స్ వచ్చాయి అంటున్నారు.


మితిమీరిన అభిమానం వల్లే ఇలా అల్లు అర్జున్ జైలు కి వెళ్ళాల్సి వచ్చింది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే . ఆ దేవుడి దయ మధ్యంతర బెయిల్ వచ్చి అల్లు అర్జున్ బయటకు వచ్చాడే ..కానీ , లేకుంటే  14 రోజులు రిమాండ్ అంటూ అల్లు అర్జున్ కి చుక్కలు చూయిచుండేవారు . ఈ విషయం అందరికీ తెలుసు . కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో బన్నీ పేరే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. బన్నీ కి జరిగినట్లు ఏ స్టార్ కి జరగకూడదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.


అందుకే స్టార్స్ ఇక ఫాన్స్ ని ఆ విషయంలో కంట్రోల్ పెట్టాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఏదైనా ఈవెంట్లో కానీ..  లేకపోతే ఎవరైనా ఫాన్స్ కానీ ఏ సినిమా విషయంలో కానీ గొడవలు పడుతూ ఉన్న ట్రోలింగ్ చేస్తూ ఉన్న వెంటనే ఆ స్టార్ హీరో లేదా..?  కుటుంబం స్పందించాల్సిన విధంగా కొత్త రూల్ ని తీసుకురాబోతుందట సినిమా మండలి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది.

దీంతో ఇకపై ఫాన్స్ ఏ విషయం కారణంగా మాట్లాడాలి అన్న.. ట్రోల్ చేయాలి అన్న .. ఒక హీరోని మరొక హీరో.. ఇబ్బందికరంగా సిచువేషన్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచించాలి నిజంగా ఈ నిర్ణయం మంచిదనే చెప్పాలి . చూద్దాం మరి ఈ నిర్ణయంతోనైనా ఫ్యాన్స్ మారుతారో లేదా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: