టాలీవుడ్ లో ఎవరికీ భయపడని నాగార్జునకు చెమటలు పట్టించిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

Amruth kumar
. . .  ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
తెలుగు చిత్ర పరిశ్రమ లో సీనియర్ స్టార్ హీరోల లో అక్కినేని నాగార్జున కూడా ఒకరు .. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కొడుకు గా టాలీవుడ్ లో అడుగు పెట్టిన నాగార్జున తర్వాత తండ్రి ని మించిన తనయుడు గా మన్మధుడు గా, కింగ్ గా టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్నాడు . అలాగే తెలుగు లో ఎందరో హీరోయిన్లతో నాగార్జున నటించే సమయం లో వారితో ఎంతో సన్నిహితం గా ఉండడం తో ఆయనకు లేడీ మాన్ అనే పేరు కూడా వచ్చింది ..

 
ఇక తన సినీ కెరియర్ లో ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల తో నాగార్జున కు ఎఫైర్లు ఉన్నాయ నే వార్తలు ఇప్పటి కి బయటకు వస్తున్నాయి .  అయితే హీరోయిన్ల తో ఎంతో చనువుగా ఉండే నాగార్జున .. ఇన్నీ సంవ‌త్స‌ర‌ల అయ‌న కెరియర్ లో ఎప్పుడు ఏ హీరోయిన్ కి భయపడలేదు కానీ .. ఓ హీరోయిన్ కు మాత్రం ఆయన భయపడ్డారట .. ఆ హీరోయిన్ మరెవరే కాదు దివంగత అతిలోక సుందరి శ్రీదేవి .. నాగార్జున , శ్రీదేవి కలిసి గతం లో నాలుగు సినిమాల్లో నటించారు . అందులో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి ..

రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి .. గోవింద గోవింద , ఆఖరి పోరాటం మూవీ ల‌లో నాగార్జున , శ్రీదేవి జంట గా నటించారు .. ఈ సినిమా ల‌ షూటింగ్ సమయం లో నాగార్జున ఎంతో భయపడ్డారట .. అందుకు ప్రధాన కారణం శ్రీదేవి గ‌తంలో నాగేశ్వరరావు , ఎన్టీఆర్ , కృష్ణ వంటి అగ్ర హీరోల తో నటించింది .. అలాంటి సీనియర్ హీరోయిన్ తో నేను నటించగలనా అనే ప్రతిసారి ఆమె తో నటించే సమయం లో నాగార్జున భయపడే వారిని అంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: