మహేష్ ఫ్యాన్స్ కు ఏడుపొక్కటే తక్కువ.. జక్కన్న తొలిసారి తప్పు చేస్తున్నారా?

Reddy P Rajasekhar
మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమాపై అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ మధ్య కాలంలో వేర్వేరు ఈవెంట్లలో కనిపిస్తుండగా మహేష్ ఫ్యాన్స్ కు ఏడుపొక్కటే తక్కువ అని చెప్పవచ్చు. జక్కన్న తొలిసారి తప్పు చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
మహేష్ రాజమౌళి కాంబో మూవీ మొదలుకావడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీలో ప్రియాంక చోప్రా నటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ ఒక సినిమా కోసం ఇన్నేళ్ల సమయం కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలై మూడు సంవత్సరాలు అయినా జక్కన్న ఇప్పటికీ కొత్త సినిమాను మొదలుపెట్టకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా సినిమాల కోసం ఇంత సమయం కేటాయించడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి బడ్జెట్ విషయంలో సైతం ఎలాంటి సమస్యలు లేవు.
 
రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఇదే అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎన్ని భాగాలుగా తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కోసం 2028 వరకు వెయిట్ చేయాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీలో కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: