నాగబాబు ఇంటికి బన్నీ... ఆ గొడవలకు శుభం కార్డు పడ్డట్టేనా?
అయితే జైలుకి వెళ్లి వచ్చాక అల్లు అర్జున్ ఒక్కొక్కరిని కలుస్తున్నాడు. నేడు ఉదయం అల్లు అర్జున్ తన మామ మెగా స్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లాడు. ఇప్పుడు నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు. అయితే కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి దూరం పెరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, బన్నీ కూడా మెగా కుటుంబం నుండి వేరు కావాలని చూస్తున్నట్లు తెలిసిందే. అలాగే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ తన అభిమానులను మెగా ఫాన్స్ అని కాకుండా అల్లు ఆర్మీ అని పిలవడం జరిగింది. బన్నీ ఎక్కడికి వెళ్లిన.. అది ముంబై అయినా, కేరళ అయినా తాను అలాగే సంబోధించాడు.
దీంతో మెగా కుటుంబంతో దూరం పెరిగింది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోటీగా అల్లు అర్జున్ సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఇకపోతే ఇప్పుడు చిరంజీవి, నాగబాబు ఇంటికి వెళ్లడం అయిపోయింది. మిగిలింది పవన్ ఒక్కడే, ఇక అల్లు అర్జున్ పవర్ స్టార్ ని కూడా కలిస్తే వారి కుటుంబంలో జరిగే గొడవలకు శుభం కార్డు పడ్డట్టే అని అభిమానులు అనుకుంటున్నారు.