బాలయ్య, చరణ్‌, వెంకీలను భయపెడుతున్న తమ్ముడు ?

frame బాలయ్య, చరణ్‌, వెంకీలను భయపెడుతున్న తమ్ముడు ?

Veldandi Saikiran
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నితిన్ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువలో ఉంటారు. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'రాబిన్ హుడ్'. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలోనే వెంకీ - నితిన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా భీష్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రాబిన్ హుడ్ సినిమాపై అంతకుమించి అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 


వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే రాబిన్ హుడ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధినేతల ఆలోచనగా టాక్ వినిపిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ మైత్రి సంస్థ నుంచి వచ్చిన "పుష్ప-2" కు లాంగ్ రన్ ఉంటుందని అంటున్నారట. క్రిస్మస్ సెలవుల్లో కూడా మంచి వసూలు రాబడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.


అయితే దానికి పోటీగా తమ సంస్థ నుంచి మరో సినిమాను రిలీజ్ చేయడం ఎందుకు అని ఆలోచిస్తున్నారట. నితిన్, వెంకీ కుడుముల ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చని సమాచారం అందుతోంది. ఒకవేళ సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారట.


కాగా, వచ్చే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన "గేమ్ చేంజర్", బాలకృష్ణ హీరోగా చేసిన "డాకు మహారాజు", వెంకటేష్ నటించిన "సంక్రాంతి వస్తున్నాం" సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు వారితో నితిన్ కూడా రాబిన్ హుడ్ సినిమాతో పోటీ పడడానికి సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: