బాలయ్య, తారక్ సినిమాలతో 14 కోట్ల లాభం.. ఆ నిర్మాత అదృష్టవంతుడే!

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు మంచి గుర్తింపు ఉంది. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ తో ఆది సినిమాలను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలతో ఏకంగా 14 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
 
బాలయ్య, తారక్ సినిమాలతో ఈ స్థాయిలో లాభం అంటే బెల్లంకొండ సురేష్ అదృష్టవంతుడే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నందమూరి హీరోలతో ఎక్కువ సంఖ్యలో సినిమాలను నిర్మించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. మంచి కథలను ఎంచుకోవడం బెల్లంకొండ సురేష్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.
 
బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తమ కొడుకులతో ఈ ప్రొడ్యూసర్ ఎక్కువగా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం. బెల్లంకొండ సురేష్ రాబోయే రోజుల్లో నిర్మాతగా ఎంతమేర రాణిస్తారో చూడాల్సి ఉంది. నందమూరి హీరోలతో ఈ నిర్మాత సినిమాలు తీస్తే మరిన్ని విజయాలు చేరే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో బిజీగా ఉండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో బిజీగా ఉన్నారు. నందమూరి హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతూ భారీ విజయాలను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నందమూరి హీరోల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు. నందమూరి హీరోల సినిమాల బడ్జెట్లు సైతం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగాయని చెప్పవచ్చు. నందమూరి హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నందమూరి హీరోల క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: