నందమూరి వంశంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.. దివంగత నందమూరి హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడంతో తారక్ కి నందమూరీ ఫ్యామిలీ లో కలిసేందుకు చాలా సమయమే పట్టింది.. పెద్దాయన తారక్ ని మనవడిగా స్వీకరించడంతో పాటు ఆయన పేరును కూడా తారక్ కి దానం చేసారని గతంలో హరికృష్ణ బహిరంగంగానే చెప్పారు..ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తన ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు.. ఎన్టీఆర్ కి తన తల్లి షాలిని చిన్నప్పటి నుంచి ఇచ్చిన ధైర్యమే ఎన్టీఆర్ ని స్టార్ హీరోని చేసింది.. ఆది సినిమాతో ఎన్టీఆర్ అద్భుతమైన నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఆది సినిమా చూసిన బాలయ్య అద్భుతంగా చేసావ్ అంటూ ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారు.. అక్కడ నుండి ఎన్టీఆర్, బాలయ్య బంధం ఎంతో స్ట్రాంగ్ అయింది..నాన్న,బాబాయ్ ఏది చెబితే అది ఎన్టీఆర్ ఫాలో అయ్యేవాడు.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో బాలయ్య, హరికృష్ణ ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు.. చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఎంతో కష్టపడ్డారు.. 2009 ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ సైతం తాతగారిలాగా ఖాకి బట్టలు ధరించి టీడీపీకి ప్రచారం చేసాడు.
చిన్న వయసులోనే ఎన్టీఆర్ అద్భుతమైన స్పీచ్ తో జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాడు.. కానీ ఆ ఎన్నికలలో సైతం టీడీపీ ఓడిపోయింది..దీనితో ఎన్టీఆర్ ని పార్టీగా దూరంగా ఉంచారు.. మెల్లగా ఎన్టీఆర్ ని కూడా దూరం పెట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు..అయితే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ప్రమాదంలో మరణించడంతో ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడు..ఆ సమయంలో ఎన్టీఆర్ ని బాలయ్య ఓదార్చారు.. ఆ సమయంలో బాలయ్య తన కోసం నిలబడటంతో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.. హమ్మయ్య బాబాయ్, అబ్బాయి కలిసిపోయారు అనుకునే లోపే మళ్ళీ ఫ్యాన్స్ వార్ మొదలయింది..
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య బహిరంగంగా ఎలాంటి గొడవ లేకపోయినా కానీ అంతర్గతంగా మాత్రం పెద్ద గొడవే జరిగిందని న్యూస్ బాగా వైరల్ అయింది..అంతేకాదు గతంలో ఎన్టీఆర్ వర్ధంతి ఫ్లెక్సీల రగడ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు వేయించడంతో అక్కడ మళ్ళీ రచ్చ మొదలైంది.. తన తండ్రికి నివాళులు అర్పించడానికి వచ్చిన బాలయ్య ఆ ప్లెక్సీలు చూసి వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించడం జరిగింది. తీయించేయ్ అంటూ అక్కడ వున్న వారిపై గట్టిగా అరిచేసారు.. దీనితో బాలయ్య కి ఎన్టీఆర్ అంటే కోపం అలానే ఉందని ఫ్యాన్స్ భావించారు.. ఎన్నేళ్లు అయిన వారిద్దరూ కలిసి కనిపించిన క్షణాలు చాలా తక్కువ అని చెప్పాలి.