కీర్తి సురేష్: పెళ్లి అయ్యాక ఇవేం పనులు..పబ్లిక్‌ గానే లిప్‌ కిస్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో చాలామంది హీరోయిన్లు పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లకు పెళ్లి కాగా...మరికొంతమంది పెళ్లికి సిద్ధమయ్యారు.ఇలాంటి నేపథ్యంలో తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్.. ఆంటోనీ తట్టిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్.


దాదాపు 14 సంవత్సరాలు అతన్ని సీక్రెట్ గా లవ్ చేసిందట కీర్తి సురేష్.స్కూల్ సమయం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు.అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన హీరోయిన్ కీర్తి సురేష్... ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయ్యాక.... కుటుంబ సభ్యులకు కూడా వివరించారు. ఇక ఇద్దరు సెటిల్ కావడంతో... కీర్తి సురేష్ ప్రేమ వివాహానికి ఎవరు అడ్డు చెప్పలేదు. దీంతో నాలుగు రోజుల కిందట హిందూ సాంప్రదాయ పద్ధతిలో... హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం జరిగింది.
టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం గోవాలోనే నిర్వహించారు. టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహానికి సెలబ్రిటీలు అందరూ వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు వైరల్ కావడంతో అందరూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా... పెళ్లి అయిన వారం రోజులకే.. హీరోయిన్ కీర్తి సురేష్ మరోసారి పెళ్లి చేసుకుంది.


 క్రిస్టియన్ పద్ధతిలో ఈసారి తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. క్రిస్టియన్ పద్ధతి ప్రకారం... రింగులు మార్చుకోవడం... కిస్సులు పెట్టుకోవడం ఉంటుందట. అచ్చం అదే పద్ధతి అవలంబించిన ఈ ఇద్దరు.... క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అయితే తన ప్రియుడికి కిస్ పెట్టిన కీర్తి సురేష్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నేటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కీర్తి సురేష్ చాలా హాట్ గురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: