ఆ పార్ట్ కి రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ.. సమంత షాకింగ్ పోస్ట్.?

Pandrala Sravanthi
ఏంటి రకుల్ ప్రీత్ సింగ్ ఆ పార్ట్ కి నిజంగానే సర్జరీ చేయించుకుందా.. రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుంటే సమంత ఎందుకు కామెంట్ పెట్టింది.. ఇంతకీ సమంత పెట్టిన ఆ కామెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ నార్త్ లో తన సత్తా చాటి ప్రస్తుతం  పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి లో తన లాంగ్ లైఫ్ పార్ట్నర్ అయినటువంటి నిర్మాత జాకీ భగ్నానీ ని గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లయ్యాక రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఇక ఈ ఏడాది శివ కార్తికేయన్ నటించిన అయిలాన్ మూవీలో కనిపించినప్పటికీ ఈ సినిమా ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ కి అంతగా ఉపయోగం ఏమీ లేదు. ఇక కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీలో కూడా సిద్ధార్థ్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించినప్పటికి అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. 

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు.అయితే రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ మొహానికి గాయమైన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఈమెకి అవకాశాలు లేకపోవడంతో ఖాళీ సమయం మొత్తాన్ని జిమ్ చేస్తూ బాడీ ని ఫిట్ గా మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజులు చేస్తోంది.ఇక ఎక్సర్సైజులు ఎక్కువగా చేయడం వల్ల ఆమెకి ఇబ్బందులు అయ్యాయని కూడా రీసెంట్ గా చెప్పుకొచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయియ్యాక మరింత అందంగా తయారైంది.

సమయం దొరికినప్పుడల్లా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో వహ్వా అనిపించుకుంటుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఫోటో షేర్ చేసింది . అయితే ఆ ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉంది. ఇక ఈ ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్స్ రకుల్ ప్రీత్ సింగ్ ఫేస్ కి సర్జరీ చేయించుకుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రకుల్  ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఇదే ఫోటోపై సమంత కూడా సో నైస్ అంటూ కామెంట్ పెట్టింది.ప్రస్తుతం సమంత పెట్టిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో నిజంగానే రకుల్ ప్రీత్ సింగ్ మొహానికి సర్జరీ ఏమైనా చేసుకుందా అనే అనుమానాల్లో ఉన్నారు నెటిజన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: