ఇంకా అల్లు - మెగా గ్యాప్ అలాగే ఉందా... బ‌న్నీ అరెస్టుతో బ‌య‌ట‌ప‌డ్డ నిజం..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా .. గత కొంతకాలంగా మెగా - అల్లు క్యాంపు ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఈ కోల్డ్ వార్ లో అటు అల్లు క్యాంప్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కరే తెరమీదకు వస్తున్నారు. అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్న తీరు ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇది ఇప్పటినుంచి కాదు ఎప్పుడో అయిదారు యేళ్ల‌ క్రితం రుద్రమదేవి సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరినప్పుడు చెప్పను బ్రదర్ అన్న డైలాగ్ తో ఈ వార్ మొదలైనట్టు చెప్పాలి. అల్లు అర్జున్ అరెస్టు అయ్యాక నాగబాబు - చిరంజీవి లాంటి వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అలాగే నిన్న అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి అక్కడే లంచ్ చేశారు. అన్ని బాగానే ఉన్నాయి.

బన్నీ రిలీజ్ అయ్యి వచ్చాక అక్కడ ఇతర కుటుంబ సభ్యులతో పాటు నాగబాబు - చిరంజీవి మాత్రమే కాదు .. రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ - వైష్ణవ తేజ్ లాంటి ఏ మెగా హీరో కూడా లేడు. పవన్ కళ్యాణ్ జాడే లేదు .. ఒక చిరంజీవి సతీమణి సురేఖ మాత్రం వచ్చారు. ఆమె అల్లు అర్జున్కి మేనత్త .. రక్తసంబంధం మేనల్లుడు కావడంతో ఆమె ప్రేమగా హత్తుకుని మాట్లాడారు. చిరంజీవి మాత్రం అల్లు అర్జున్ అరెస్టు విషయంలో మనస్పూర్తిగా స్పందించి పూర్తిగా అండగా ఉన్నారు. మిగిలిన మెగా హీరోలు ఎవరు కూడా ఆ స్థాయిలో స్పందించలేదు అన్నది వాస్తవం. రామ్ చరణ్ కానీ .. పవన్ కళ్యాణ్ కానీ ఇతర మెగా హీరోలు బన్నీ అరెస్టు విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తోంది. ఏది ఏమైనా మెగా - అల్లు కుటుంబాల మధ్య ఏదో అతని గ్యాప్ అయితే కనిపిస్తోంది అన్నది వాస్తవం. మరి ఇది ఎప్పటికీ అతుక్కుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: