హెరాల్డ్ టాలీవుడ్ కాంట్రవర్సీలు 2024 : అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ .. ఇప్పటికీ చల్లారని మంట..!
ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు .. ఆ రచ్చతో మెగా కుటుంబం వర్సెస్ అలు ఫ్యామిలీ అనే విధంగా టాలీవుడ్ లో కొత్త చర్చకు తరలిపోయాడు .. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి ఆయనకు మద్దతు ఇవ్వడం మెగా ఫ్యామిలీకి , మెగా అభిమానులకు జనసేన నాయకులకు అసలు నచ్చలేదు.. మెగా కుటుంబం మొత్తం ఒక తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా నిలిస్తే. అల్లు అర్జున్ మాత్రం సపరేట్గా వైసీపీ చెంతన చేరాడు. ఈ వ్యవహారంతో అల్లు అర్జున్ పై మెగా అభిమానులు ఇప్పటికీ కోపం తగ్గలేదు .. అల్లు అర్జున్ గతంలో పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఆర్జం పోసాయి .. ఇదే క్రమంలో పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిలిసిలట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే ..
ఇక ఆ తర్వాత రోజు బెయిల్ రావడంతో ఆయన్ను రిలీజ్ చేశారు .. ఆ సమయంలో అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీ చిరంజీవి నుంచి నాగబాబు వరకు ఎంతో సపోర్టుగా నిలిచారు .. తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి , నాగబాబుని కలిసి వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు ..ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్లలేదు .. అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ కూడా ఎంతో వైరల్ గా మారింది. మెగా కుటుంబంలో ఉన్న మిగిలిన హీరోలు అల్లు అర్జున్తో కలిసిన పవన్ కళ్యాణ్ కు మాత్రం అల్లు అర్జున్ పేరు చెబితేనే మండిపోతుందని మరికొందరు అంటున్నారు .. అందుకే ఇప్పటికీ అల్లు అర్జున్ కలవడానికి పవన్ కు ఇష్టం లేదని అంటున్నారు .. ఇలా ఈ సంవత్సరం అల్లు అర్జున్ చేసిన అనుకొని పనులతో 2024 సంవత్సరం ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.