తారక్‌ను ఆ లుక్లో చూసి తట్టుకోలేకపోయారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూసర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం తారక్ హీరోగా బృందావనం అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు తెలియజేశాడు. దిల్ రాజు బృందావనం సినిమా గురించి మాట్లాడుతూ ... వంశీ పైడిపల్లి నాకు బృందావనం సినిమా కథను వివరించాడు. కథ నాకు బాగా నచ్చింది. అప్పటికి తారక్ వరస పెట్టి మాస్ , యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తున్నాడు.

దానితో బృందావనం లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథ అయితే జూనియర్ ఎన్టీఆర్ పై చాలా కొత్తగా ఉంటుంది. ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది అని నాకు అనిపించింది. వెంటనే నేను జూనియర్ ఎన్టీఆర్ కి ఈ కథను వినిపించాను. ఆయన కూడా ఈ కథ విన్న వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానితో మేము తారక్ మునుపటి సినిమాల కంటే కాస్త కొత్త లుక్ ట్రై చేయాలి అనుకున్నాం. దానితో ఆయనకు చిన్న గడ్డం , చిన్న మీసాలను మాత్రమే ఉంచి ఓ లుక్ ప్రిపేర్ చేసి ఒక పోస్టర్ను విడుదల చేశాం. ఆ పోస్టర్ను విడుదల చేసిన తర్వాత జనాల నుండి నెగటివ్ టాక్ వచ్చింది.

తారక్ ఏంటి ఇలా ఉన్నాడు. ఇంత క్లాస్ లుక్ ఆయనకు సెట్ అవుతుందా అనే విమర్శలు వచ్చాయి. కానీ నేను మాత్రం సూపర్ గా సెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యాను. ఇక సినిమా విడుదల అయింది. తారక్ ను ఆ లుక్ లో చూసి అందరూ ఫిదా అయ్యారు. అలా బృందావనం సినిమాలోని తారక్ లుక్ కి ఫస్ట్ నెగటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఆ లుక్ కి చాలా మంది ఫిదా అయ్యారు అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: