హెరాల్డ్ టాలీవుడ్ కాంట్రవర్సీలు 2024 : నాగార్జునతో మొదలైన టాలీవుడ్ సంచనాలకు..బన్నీ అరెస్ట్ తోనైనా ఎండ్ కార్డ్ పడ్డట్టేనా.?
మరోవైపు కాంగ్రెస్ కు చెందిన మహిళ మంత్రి..కేటీఆర్ కు నాగార్జున మాజీ కోడలు సమంతను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేయలేదు కొండా సురేఖ. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఇదంత కరెక్ట్ కాదని కూడా చెప్పలేదు. కనీసం తన క్యాబినేట్ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించను లేదు.తాజాగా పుష్ప 2 వ్యవహారంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం వెనక అల్లు అర్జున్ బాద్యుడిని చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయడం వెనక కూడా రేవంత్ రెడ్డి సర్కారు హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ ఇద్దరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించరన్న ఒకే ఒక్క రీజన్ తో వీళ్లను రేవంత్ సర్కారు వేధింపులకు దిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా శుక్రవారమే బన్నిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం వెనక కూడా శని, ఆదివారాలు కోర్టులు ఉండవు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసి జైల్లో వేసి తన ప్రతాపం ఏంటో చూపించాలనే ఉద్దేశ్యంతో ఇదంత చేసాడనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పుష్ప 2 ప్రెస్ మీట్లో తన పేరు మర్చిపోవడంపై రేవంత్.. అల్లు అర్జున్ తీరుపై గుర్రుగా ఉన్నారు రేవంత్ రెడ్డి. తన పేరు భవిష్యత్తులో మర్చిపోకుండా గుర్తించుకోవాలనే ఉద్దేశ్యంతో ఇదంత చేసినట్టు అల్లు అర్జున్ అభిమానులతో పాటు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మొత్తంగా దేశంలో ఎంతో మంది నేరస్తులను అరెస్ట్ చేయడం మానీ.. ఈ ఘటనతో సంబంధం లేని అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.మరవైపు అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. పైగా చనిపోయిన మహిళ భర్త తాను అల్లు అర్జున్ విత్ డ్రా చేసుకుంటున్నట్టు చెప్పినా..అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొత్తంగా అపుడు నాగార్జున..ఇపుడు అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శకులు వ్యక్తం అవుతున్నాయి.