అల్లుఅర్జున్ హడావిడి వల్లే అలా జరిగిందంటున్న నిర్మాత.!

FARMANULLA SHAIK
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ్ అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్ అవ్వడం, హైకోర్టు బెయిల్ ఇవ్వడం, బయటకు రావడం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించాడు. అవతల ఒక ప్రాణం పోయింది.. ఇక్కడ ఎవరు ఉన్నారనేది చూడం.. ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే అని అన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అరెస్ట్ మీద భిన్న రకాల వాదనలు వినిపించాయి. ఫస్ట్ టైం ఇలా ఒక సెలెబ్రిటీని అరెస్ట్ చేశారు.. అంటూ సీఎంని పొగిడితే.. అసలు అక్కడ బన్నీ చేసిన నేరం ఏంటి? ఇది కక్ష్య సాధింపు చర్యే అని ఇంకొందరు విమర్శించారు.అయితే తాజాగా ఈ ఘటన మీద తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. మీడియా డిబేట్‌లో మాట్లాడిన తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

అసలు తన దృష్టిలో అయితే బన్నీ పీఆర్ టీంను అరెస్ట్ చేయాలని అన్నాడు. ఇంత హడావిడి చేసినందుకు, ఇంత ఆర్భాటాలకు పోయినందుకు అలా జరిగింది అంటూ కామెంట్ చేశాడు. బన్నీ నార్మల్‌గా వెళ్లి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని, ముందే లీక్స్ ఇచ్చి హడావిడి చేయడంతోనే ఇలా జరిగిందని అన్నాడు.జాతీయ అవార్డు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి చెడ్డ పేరు రాదా అని సదరు యాంకర్ అంటే తప్పు ఎవరు చేసినా తప్పే జాతీయ అవార్డు వచ్చిందని, భారత రత్న ఇచ్చామని మర్డర్ చేసిన వారిని వదిలి పెట్టలేం కదా.. తప్పు చేసింది ఎవరైనా సరే ఒకటే అని అన్నాడు. ఈ ఘటనలో బన్నీకి పూర్తిగా సంబంధం లేదు కానీ ఆయన వెళ్లడం వల్లే ఇది జరిగింది కాబట్టి నైతిక బాధ్యత అయితే ఉంటుందని అన్నాడు.గతంలో చిరంజీవి సినిమాలకు జరిగిందంటే.. ఆయన వెళ్లలేదు థియేటర్లో టికెట్లు తీసుకుంటూ ఉండగా తొక్కిసలాటలో జరిగింది.. అప్పుడు థియేటర్ యాజమాన్యానిది తప్పు అవుతుందంటూ తమ్మారెడ్డి తన స్టైల్లో ఈ ఘటనను విశ్లేషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: