మోహన్ బాబు మొదటి భార్య చనిపోవడానికి అసలు కారణం అదే.?
దీంతో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించే వారట. కానీ మోహన్ బాబు సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దాంతో ఇద్దరి మద్య గొడవలు జరిగాయట. కాగా చిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో విద్యా దేవి బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతుంటారు. అనంతరం మోహన్ బాబు విద్యా దేవి సోదరినే రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ మనోజ్ జన్మించాడు. ఇక మోహన్ బాబు తన విద్యా సంస్థలకు మొదటి భార్య పేరునే పెట్టారు.ప్రస్తుతం నిర్మాతగా, విద్యాసంస్థల డైరెక్టర్ గా మరియు నటుడిగా కొనసాగుతున్నారు. మరో వైపు మోహన్ బాబు అసలు పేరు కూడా ఎవరికీ తెలియదు. మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం నాయుడు కాగా ఆయనకు దివంగత దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు స్క్రీన్ నేమ్ గా మోహన్ బాబు అని నామకరణం చేశారు. ఇక అదే పేరుతో మోహన్ బాబు పాపులర్ అయ్యారు.